Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక భవనంలో పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమా వేశంలో భూపాలపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సంఘం రాష్ట్ర నాయకులు మన్నె చంద్రయ్య, ఎన్నికల అధికారిగా వాంకుడోతు జ్యోతి వ్యవహరించారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా రాచర్ల శ్రీనివాస్, సహా అధ్యక్షులుగా మంద రమేష్, ఉపాధ్యక్షులుగా వేల్పుల సాగర్, మంగళంపల్లి చిరంజీవి, బండారి కుమార స్వామి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా యస్. కరుణశ్రీ, ప్రధానకార్యదర్శిగా పసుల శంకర్, జిల్లా కార్యదర్శులుగా మేకల సంతోష్, కురుసం అశోక్, గంట రామకష్ణ, మహిళా కార్యదర్శిగా బి.మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలు తీర్మా నాలు చేశారు. సంఘం సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దావు రమేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావులకార్ వెంకటేష్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి తాడిచెర్ల రవి, నాయకులు మంద రమేష్, నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా రాచర్ల శ్రీనివాస్
నవతెలంగాణ-భూపాలపల్లి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా రాచర్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని సింగరేణి కార్మిక భవనంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ సందర్భం గా శ్రీనివాస్ మాట్లాడుతూ... జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్ ప్రకటించాలని అన్నారు. సీపీఎ్స్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రమోషన్లతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలన్నారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు. బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలను డిఎస్సీ ప్రకటించి భర్తీచేయాలన్నారు. నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలని, పెండింగ్ మూడు డీఏలను ప్రకటించాలన్నారు. పెండింగ్ సప్లిమెంటరీ బిల్లులను మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని, ఎఫ్ ఎల్ ఎన్ ప్రోగ్రాం గురించి ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించాలని,ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులు భర్తీచేయాలన్నారు. వంగపల్లి శంకర్, రఘునందన్, శ్రీ పాల్, రాపర్తి రాంబాబు, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.