Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ)లో
- చోటు దక్కలేదని టీపీసీసీకి రాజీనామా...
- రెండు నియోజకవర్గాల కోసమేనా..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీపీసీసీ జంబో కార్యవర్గాన్ని ప్రకటించి 48 గంటలు కాకముందే కొండా సురేఖ రాజీనామాతో కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చోటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజీనామా లేఖను టీపీసీసీ ి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పంపింది. ఇది కేవలం టీపీసీసీ కార్యవర్గ సభ్యురాలి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడేది లేదని, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీలో 'కొండా' దంపతులు చేరుతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలను వారి కుటుంబానికి కేటాయించాలని చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాగా కొండా.. రాజీనామా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన తనను రాజకీయ వ్యవహారాల కమిటీలో నియమించక పోవడం పట్ల కలత చెందినట్లు పేర్కొంది. 34 ఏండ్లుగా రాజకీయాల్లో వున్న 'కొండా' దంపతులకు ఈ పదవినివ్వడం పట్ల తీవ్రంగా ఆక్షేపించింది. తనకంటే జూనియర్లను రాజకీయ వ్యవహారాల కమిటీలో తీసుకొని, సీనియర్నైనా నన్ను అవమానించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఆమె రాజీనామా వెనక రెండు శాసనసభ నియోజకవర్గాలు తన కుటుంబానికి దక్కేలా చేసుకోవడానికేనని తెలుస్తోంది. గతంలో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొండా సురేఖ అనంతర పరిణా మాల్లో వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండే పోటీ చేయ నున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో టీపీసీసీ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఇనుగాల వెంకట్రాం రెడ్డిని నియమించింది. తాజాగా 'కొండా' దంపతులు పరకాల నియోజకవర్గంపై కూడా కన్నేశారు. కొండా సురేఖ వరంగల్ తూర్పులో, ఆమె కూతురు సుస్మితా పటేల్‌ను పరకాల బరిలో దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గతంలో టీర్ఎస్లో ఉన్నప్పుడు కూడా 'కొండా' దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, వరంగల్ తూర్పు, నర్సంపేట, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మాకు బలముందని ప్రచారం చేసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో మేం చెప్పిన వారికే పార్టీ టికెట్ ఇవ్వాలన్న స్థాయిలో ప్రచారం సాగిం చారు. ఈ క్రమంలో టీఆర్ఎస్లో పొమ్మనకనే పొగ పెట ్టడంతో టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయాక వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండే పోటీ అని ప్రకటిం చిన అనంతరం మళ్లీ పరకాలపై దృష్టి సారించడం గమ నార్హం. 'కొండా' దంపతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 'కొండా' దంప తులు ఏ పార్టీలో వున్న వారికి శత్రువులున్నారు. కాంగ్రెస్ లోనూ వారి పట్ల విముఖత వున్న నేతలు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ కార్యవర్గసభ్యురాలి పదవికి రాజీనామా చేయడంతో 'కొండా' దంపతులు ఆశిస్తున్న దేమిటీ ? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు టిపిసిసి కార్యవర్గానికి సంబంధించి ఎలాంటి చేర్పులు, మార్పులు చేసినా, ఆ దిశగా మరిన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో 'కొండా' దంపతుల వ్యూహం ఫలిస్తుందా ? లేదా? అన్న చర్చ సాగుతోంది. టిపిసిసిలో పదవి ఇవ్వకపో యినా రెండు నియోజకవర్గాలను తమకు కేటాయిస్తే చాలన్న ధోరణిలో 'కొండా' దంపతులున్నట్లు సమాచారం. కాగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వున్న కొండా సురేఖ రాజకీయంగా చురుకైన పాత్ర పోషించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయలేదు. దీంతో వారి పట్ల నాయకత్వం, స్థానిక నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు.