Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు ఔట్సోర్సింగ్
- కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
డిసెంబర్ 21,22,23 తేదీలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ లోని సుందరయ్య భవన్లో సంబం ధిత పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు,. రాష్ట్ర కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాల్ని రూపొం దించేందుకు రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో కార్మిక హక్కులను హరిస్తూ కార్మిక చట్టాలను మారు స్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోం దన్నారు. దేశ ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని మోసం చేస్తుందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు, ఓఎన్జిసి, ఎయిర్ లైన్స్, విశాఖ ఉక్కు డిఫెన్స్ తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబ డులను ఆహ్వానించి వాటిని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొ చ్చిన ఎనిమిదేండ్లలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి విస్మరించడం శోచనీయమన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల జీవోలను తక్షణమే సవరించి గెజిట్ విడుదల చేసి కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 23వ తేదీన కార్మిక మహా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు మెట్టు రవి, బొల్లారపు సంపత్ బరుపట్ల మహేష్, యాస బాబు, రాజు పాల్గొన్నారు.