Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా ఇన్సూరెన్స్
- ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
- 'సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
- ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ రవీంద్రనాథ్
నవతెలంగాణ - హనుమకొండ
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, 'సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ రవీంద్రనాథ్ విమర్శించారు. ఆదివారం స్థానిక ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్ ప్రాంగ ణంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ వరంగల్ డివిజన్ 36వ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఐసీఈయూ వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ మర్రి ప్రభాకర్ అధ్యక్షత న నిర్వహించిన సభలో వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి జగదీశ్వర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం వేణుగోపాల్, రవీంద్రనాథ్ ప్రసంగించా రు. ప్రజల సంపదను కొద్ది మంది పెట్టుబడి దారులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను హరించే చట్టాలను తీసుకువచ్చి యాజమాన్యాలకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఎల్ఐసీలో ఐపిఓ పేరిట వాటాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించిందని, దీనికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డు తగిలిందని అన్నారు. అయినా పార్లమెంటులో ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లును తెచ్చి 3.5శాతం వాటాలను ఉపసంహరించిందని తెలిపారు. ఎల్ఐసి ప్రీమియం సేకరణలో, నూతన పాలసీలను చేయడంలో సంఖ్యను గణనీయంగా వృద్ధి పర్చుకొని 74శాతం వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగు తుందని తెలిపారు. కేవలం ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగడం దీనికి ప్రైవేట్ మార్కెట్ శక్తుల ప్రమేయం కూడా కారణమన్నారు. ఎల్ఐసి షేర్ వాల్యూ తగ్గుతున్న సూచికను ఎల్ఐసీ అభివృద్ధి ప్రామాణికంగా తీసుకోకూడదన్నారు. ఐపీఓ అనం తరం కూడా ఎల్ఐసి వ్యాపార అభివృద్ధిలో గణనీ యమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వక్రీకరించి, బీజేపీ ప్రభుత్వమే అసలైన దేశాభివద్ధిని కాంక్షించే ప్రభుత్వ మని చెప్పుకోవడం సరికాదన్నారు. ఐక్య పోరాటాల తో ఎల్ఐసి సంస్థను కాపాడుకుని, ఉద్యోగుల హక్కు లు, సదుపాయాలను పరిరక్షించుకోవాలని పిలుపుని చ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో విభజన రాజకీయం చేస్తూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్మిక వర్గ ఐక్యతకై పబ్లిక్ రంగ సంస్థల పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ నగర అధ్యక్షుడు జి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందని, కేంద్రంలో లేబర్ కోడ్ చట్టాలను సవరిస్తూ, ఉన్న హక్కులను కాలరాస్తోందన్నారు. దీనిని అధిగమిం చేందుకు ఉద్యోగ కార్మిక వర్గాలు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.