Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలం లోని తాడిచెర్ల, మల్లారం, రావులపల్లి గ్రామాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో అరబో సిన ధాన్యం తడిసి ముద్దాయి రైతులకు అపార నష్టం జరిగిందని లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి, లక్షలు పెట్టుబడులు పెట్టి పండించిన వరిదాన్యం ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామంటే నోట్లోకొచ్చిన సమయంలో మాండస్ తుపాన్ రైతులను నిండా ముంచిందని వాపోతున్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనాలని, పంటలు నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకో వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మహదేవపూర్ : మహాదేవపూర్ మండలం లోని అనేక గ్రామాలలో ఆదివారం సాయంత్రం కురి సిన అకాల వర్షానికి పత్తి, వరి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. చేతికి వచ్చిన పంటకు నష్టం జరగడంతో రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారు. మిర్చి పంటలో తెగులు వచ్చి పూత కాత లేదని, దీనికి తోడు వర్షం పడడంతో పత్తి పంట దెబ్బ తిని తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతు న్నారు. పంట నష్టంను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.