Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
మొండ్రాయి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం గ్రామంలో బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తి చేస్తానని, ప్రజలు పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఈజిఎస్ డైరెక్టర్ యాకయ్య, ఎంపీపీ జ్యోతి మార్కెట్ చైర్మన్ రాము మండల పార్టీ అధ్య క్షుడు రామోజీ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, సర్పంచుల పోరం అధ్యక్షుడు మధుసూదన్, స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల ఊర్మిళ సోమయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.