Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో పోస్టుకు లక్ష నుండి రెండు లక్షల డిమాండ్ - డబ్బులు ఇస్తేనే పోస్టులు భర్తీ - పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు
నవతెలంగాణ-ములుగు
అంగట్లో సరుకులాగా... కేజీబీవి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను అమ్ము కుంటున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుముల రాజకుమార్ అధ్యక్షతన జరిగిన సమా వేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ హాజరై మాట్లాడుతూ కేజీబీవి హాస్టల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడంలో డిఇఓ డబ్బు లు తీసుకుంటూ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, డబ్బులు ఇస్తే గాని ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని, ఇదెక్కడి అన్యాయమని బాధితులు అడు గితే మీకు ఉద్యోగం కావాలా..? వద్దా..? అని బెదిరిస్తు భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. కాబట్టి ఏవైతే నోటిఫికేషన్ వేశారో వాటిని పారదర్శకంగా భర్తీ చేయాలని, అప్లికేషన్ పెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ న్యాయం చేయాలని, డబ్బులు ఇస్తేనే కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల్లో చేరిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుకు దూరమై కనీస వసతులు దూరమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. కాబట్టి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు,బాధితులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని, లేనియెడల పెద్ద ఎత్తున కార్యక్రమాలకు సన్న ద్ధమైతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నరేష్, సురేష్, వెంకట్, ప్రవీణ్, రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.