Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 6 నుంచి 8 తరగతి వరకు ఇస్తున్న ఫ్రీ మెట్రీస్ స్కాలర్షిప్లను కొన సాగించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహి ళా కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాగా సునీత డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల మహబూబాబాద్ యందు ఎస్సీ, ఎస్టీ ఉపా ధ్యాయ సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ స మావేశం సంఘం జిల్లా అధ్యక్షులు చాగంటి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పాగ సునీత మాట్లాడారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లను ఎప్పటిలాగానే కొనసాగించాలని కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. 6నుంచి 8వ తరగతి చదు వుతున్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న కొద్దిపాటి సహాయం ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను నిలిపి వేస్తూ, కేవలం 9,10 తరగతులు చదువుతున్న విద్యా ర్థులకు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఆరు నుంచి పదవ తరగతిలో చదువుతున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైన బాలికలకు రూ 1500, బాలురకు రూ 1000 కేంద్ర ప్రభుత్వం అం దిస్తూ వస్తుందని, ఇటీవల 6 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేత నాలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 6నుంచి8వ తరగతి చదు వుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరి గానే ఉపకార వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చే శారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్. నాగరాణి, జిల్లా కార్యదర్శి జె.యాకయ్య, జిల్లా సహా య కార్యదర్శి సోలం నరసయ్య, జిల్లా నాయకులు వాసం నాగేశ్వరరావు, కడారి శ్రీనివాస్ పాల్గొన్నారు.