Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ములుగు అధ్యక్షులు కుసుమ జగదీశ్
నవతెలంగాణ-కొత్తగూడ
రైతును రాజుగా చేయడమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని బిఆర్ఎస్ పార్టీ ములు గు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీశ్ అన్నారు. ఆదివారం మండలంలోని గుంజేడు గ్రామంలో మండల అధ్యక్షులు కొమ్మెనబోయిన వేణు అధ్యక్షతన గ్రామ పార్టీల అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తల సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో, ప్రస్తుతం కేంద్రంలో పరిపాలన చేసిన, చేస్తున్న పార్టీలు దేశ ప్రజలను దరిద్రం లోకి నెట్టేశాయన్నారు. దేశాన్ని పరిపాలన చేసిన గత ప్రభుత్వాలు దేశాన్ని సర్వ నాశనం చేసి దళారుల చేతిలో పెట్టి ప్రజలను మోసం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ నాయకత్వంలో దేశానికి పీడలా మారిన అన్ని పార్టీలను ప్రారదోలి సబ్బండ వర్గాలకు అండగా దేశంలో టీఆర్ఎస్ పార్టీ పెను మార్పులు తీసుకురావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.
అయ్యప్ప దర్శనానికి క్షేమంగా వెళ్లి రండి
అనంతరం గుంజేడు సర్పంచ్ అజ్మీరా రజిత రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ని ర్వహించిన పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దర్శనార్థం శబరిమళ వెళ్తున్న అయ్య ప్ప స్వాములు క్షేమంగా వెళ్ళిరావాలని కోరారు. ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఒడిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ దేసిడి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు ఈసం స్వామి, మండల అధికార ప్రతినిధి బానోత్ జవహర్ లాల్ నెహ్రు, ఎంపీటీసీలు హలవత్ సాలుకి సురేష్, మోకాళ్ళ సంతోషారాణి వెంకటేష్, సదానందం, సర్పంచ్ లు అజ్మీరా మంగమ్మ రవి, ఈసం కాంతమ్మస్వామి, జాటోత్ పూల్ సింగ్, పిఎసిఎస్ డైరెక్టర్లు, గ్రామ పార్టీల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.