Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈ సం సుధాకర్
నవతెలంగాణ-గూడూరు
5 వా షెడ్యూల్ కు విరుద్ధంగా 1/59 1/70 పీసా చట్టాలకు విరుద్ధంగా షె డ్యూలు ఏజెన్సీ ఏరియాలోకి వలస వచ్చిన వలసగిరిజనేతరులను ఏజెన్సీ ఏరియా నుండి బయట పంపాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్ అన్నా రు. ఆదివారం గూడూరు మండల కేంద్రంలో తుడుం దెబ్బ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈసం సుధాకర్ మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో గిరిజనతర్ల వలసలు పెరిగి అడవి అన్యాక్రాంతమవుతుంటే ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్య ధోర ణిగా చూస్తూ అడవిని అన్యాక్రాంతానికి కారకులైనారని గిరిజనేతర్ల 90% అటవీ భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరి భూమిని కూడా స్వాధీనం చేసుకోక పోవడానికి కారణమేమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అడవి అన్యకాంతం కావడానికి ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించాలని అన్యాక్రాంతా నికి కొమ్ముకాస్తున్న ఫారెస్ట్ సిబ్బంది అధికారులు కారణమని ఆరోపించారు అడవి ని ధ్వాసం చేస్తున్న గిరిజనేతరులపై చర్య తీసుకొని ఫారెస్ట్ అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వలస వచ్చిన గిరిజనులు అక్రమంగా ఆదివాసీల భూముల ఆక్రమించుకొని ఆదివాసి చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయ త్నం చేస్తున్నారని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని షెడ్యూల్ ఏజెన్సీ ఏరియా లో రాజ్యాంగానికి కట్టుబడి ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం పని చేయాలని, ఫారెస్ట్ అధికారులు ఏజెన్సీ చట్టాలకు లోబడి విధులు నిర్వహించాలని ఏజెన్సీ ఏరియాలో ఆదివాసి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో దొర పటేల్ సంఘాల నాయకులు, ఏఎస్పీ జాతీయ అధ్యక్షులు దా ట్ల నాగేశ్వరరావు, ఏహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు కల్తీ వీరస్వామి, ఈసం రామ య్య, కొట్టం వజ్జయ్య మూతి బుచ్చి రాములు, పునెం ఎర్రయ్య, శీను లక్ష్మయ్య రమేష్, దారం సాంబయ్య, మల్లేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.