Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వైపు ప్రజలు ఉన్నారని, భారతదేశానికి కాబోయే ప్రధాని కెసిఆర్ అని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తా టికొండ రాజయ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని ఆయన స్వగహంలో కాంగ్రెస్ టీడీపీ నుండి 50 మంది డైరెక్టర్ నునేముంతల యకస్వామి గౌడ్, సెల్ ప్రధాన కార్యదర్శి గుర్రాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో తాటికొండ రాజయ్య నాయకత్వం లో బిఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు భారత రాష్ట్ర సమితి గట్టి పోటీ ఇవ్వనుఉందని, సకల వర్గాల సంక్షేమం, దేశ సమగ్ర పాలన అజెండాతో కెసిఆర్ దేశాన్ని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగా ణను అభివృద్ధికి మోడల్‌గా నిలిపారని, అదే స్ఫూర్తితో ఆయన దేశాన్ని కూడా ప్రగతి పథంలో ముందుంచుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనగామ మాజీ డైరెక్టర్ నూనె ముంతల యాకస్వామి గౌడ్, కొయ్యల స్వామి, గాదెపాక యాదగిరి, కొమురయ్య రాసమల్ల, నీలం భాస్కర్, కొయ్యల యాదగిరి, మల్లయ్య, ఉప్పలయ్య, వెంకటయ్య, కిష్టయ్య, తాళ్లపల్లి ఎల్లస్వామి, గుర్రం యాదగిరి, 50 మంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.