Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మండలంలోని పటేల్ గూడెం గ్రామంలో బహుజన గోశాల ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహే ష్ అగర్వాల్ చేతుల మీదుగా రైతులకు ఉచితంగా 10 మంది రైతులకు 20 కోడె దూడలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ దేశా నికి రాష్ట్రానికి రైతు వెన్నెముక. అలాంటి రైతు వ్యవసాయ రంగంలో ఆదుకో వడం భరోసా కల్పించడం, రైతుకు పశుసంపదను అందించడం కంటే ఇక గొప్ప సంపదలేదని రైతులు గోవులను పెంచడం వలన వాటి నుండి వచ్చే పేడ మూ త్రం ద్వారా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించుకుని అధికమైన దిగుబడులు పొందవచ్చు అన్నారు. ఫెస్టిసైడ్స్ వాడడం వలన భూమి సారవంతం దెబ్బతిని రానున్న భవిష్యత్ తరాలకు విషపూరితమైన నేలను అందించిన వారమవుతామని ఆవేదన వ్యక్తంచేశారు. జనగామ జిల్లాలో గాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేకచోట్ల రైతులకు ఉచితంగా కోడెదూడలు పంపిణీ చేస్తు న్నాముఇంకా మీ బంధువుల్లో గాని మీకు తెలిసిన వారు రైతులకు మేము సహక రించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కములేకర అరవింద్, వాద్య గజా నాయక్, గిరిజన ప్రజా సంఘ ఉపాధ్యక్షుడు పవన్ రాథోడ్, సేవాలాల్ మహారాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఇరుకొండ రాము, గోరక్ష దళ్ కేతావత్ హరిలాలు, గోరక్ష దళ్ సమితి దేవవతు నిరంజన్, గోరక్ష సమితి గ్రామ సర్పంచ్ పెండ్లి దేవేంద్ర మోహ న్ రెడ్డి, ఉప సర్పంచ్ నక్కి రెడ్డి గోపేష్, వార్డు మెంబర్, గోశాల ప్రతినిధులు రమేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.