Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్వాయి రామ్మోహన్ రెడ్డి
నవ తెలంగాణ-మహబూబాబాద్
ప్రతి వ్యక్తి వాకింగ్‌తో మానసిక ఒత్తిడిని జయించవచ్చు అని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉషోదయ వాకర్ అసోసియే షన్ ఏడవ సర్వసభ్య సమావేశం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో మహ బూబాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి కష్ణమూర్తి అధ్యక్షతన జరిగిం ది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ సిహెచ్ దేవి రెడ్డి మాట్లాడారు ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల శారీరిక సామర్థ్యం, రోగ నిరో ధక శక్తి పెరగడంతోపాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. రోజు ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని, మధుమేహం, గుండె జ బ్బులు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వాకర్ అధ్యక్షులు కష్ణమూర్తి మాట్లాడు తూ ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ లో మంచి గుర్తింపు సాధించిందని, కరోనాకాలంలో సామాజిక సేవలు, ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ, అనాధ శరణాలయం పిల్లలకి దుస్తులు, ట్రంక్ బాక్స్ నోట్ బుక్స్ లో పంపిణీ చేసినట్టు తెలిపారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమ గోవర్ధన్ కోశాధికారి సాదు మైపాల్ రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, పాల బిందెల మల్లయ్య, కాపరబోయిన శ్రీనివాస్ ,తండ సదానందం, దాసరి ప్రసాద్, కన్నా అశోక్, తెల్లబోయిన లక్ష్మయ్య, తప్పెట్ల వెంకన్న, నక్క నాగార్జున, ఎర్రోజు శేఖర్, కూరపాటి మార్కండేయులు, ఎర్రబెల్లి కుమార్, దామోదర శర్మ, కోవ్వా కుల బాలకష్ణ, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.