Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు మానుకోట జిల్లా అని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌లో జిల్లా అథ్లెటిక్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలను స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడారు జిల్లా క్రీడాకారులు వివిధ క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని అన్నారు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారని అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామం లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పది కిలోమీటర్లు 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వి భాగంలో పురుషులు మహిళలకు వేరువేరుగా పరుగు పందెంనిర్వహించినట్లు తెలిపా రు. ఇందులో 684 మంది పాల్గొనగా 32 మందిని ఎంపిక చేసామని, వీరు వచ్చే నెల హస్తంలో జరిగే నేషనల్ క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్ మెదక్ జిల్లాకు దక్కగా, వరంగల్ గర్ల్స్ విభాగంలో మెదక్ జిల్లా క్రీడాకారులు గెలుచుకున్నట్లు తెలిపారు.ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన నిర్వ హించిన ముగింపు ఉత్సవాల్లో ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ విజేతలకు బహుమతు లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మో హన్ రెడ్డి ఉపాధ్యక్షులు సుదర్శన్ శివ భద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు.