Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత కార్మికుల ధర్నా - కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారిపోతుల యాదగిరి గౌడ్
నవతెలంగాణ-ములుగు
ఈనెల 28న రాష్ట్రపతి రామప్పకు వస్తున్న సం దర్భంగా హెలిప్యాడ్ దిగడం కోసం తాటి చెట్లను తొల గించడం సమంజసం కాదని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారు పోతుల యా దగిరి గౌడ్ అన్నారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో ఆదివారం తాటి చెట్లు తొలగించిన స్థలంలో ధర్నా చేసిన గీత కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవెంకటాపూర్ (రామప్ప) మండలంలోని పాలంపేట గ్రామంలో ని తాటివనం దగ్గర ఈనెల 28న రాష్ట్రపతి రామప్ప కు రాక సందర్భంగా హెలిక్యాప్టర్ దిగే స్థలంలో తాడి చెట్టు అడ్డుగా ఉన్నాయని దాదాపు 30 తాటి చెట్లను తొలగించాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు ఇవ్వడం ఇప్పటికే కొన్ని చెట్లు తొలగించడం సమంజసం కాద ని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులుకారు పోతుల యాదగిరి గౌడ్ అన్నారు. ఈరోజు పాలంపేట గౌడ సంఘం అధ్యక్షులు కారు పోతుల సత్యంగౌడ్ అధ్యక్షతన రాష్ట్ర పతి హెలికాప్టర్ దిగే స్థలంలో గీత కార్మికులతో సందర్శించడం జరిగింది. అనంతరం తొలగిన తాటి చెట్ల స్థలంలో గీత కార్మికులతో ధర్నా చేయడం జరి గింది.ఈ సందర్భంగా గుండె బోయిన రవి గౌడ్. కా రుపోతుల యాదగిరి గౌడ్లు మా ట్లాడుతూ రాష్ట్రప తి రావడం హర్షించ దగ్గ విషయమే అయినా గీతకా ర్మికుల జీవనోపాధి అయిన తాడి చెట్లను తొలగించ డం సమంజసం కాదని అన్నారు.ఇప్పటికే పాలంపే ట గ్రామంలో 105 మంది గీత కార్మికులు ఉంటే కేవ లం ఒక చిరుకకు రెండు మూడు తాటి చెట్లు మాత్ర మే వస్తున్నాయని దీంతో గీత కార్మికులకు ఉపాధి కరువుతుందని అన్నారు. ఇప్పుడు ఏకంగా 28 తాటి చెట్లు తొలగించుటకు పూనుకోవడంతో గీత కార్మి కులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. తక్షణ మే అధికారులు స్పందించి తాటి చెట్టు తొలిగింపును ఆపాలని కోరారు తప్పనిసరైతే పాలంపేట గీత కార్మి కులకు న్యాయం చేయాలని.. ఐదు ఎకరా భూమి తాడి చెట్ల పెంపకానికి కొనుగోలు చేసిన తర్వాతనే తాటి చెట్లు తొలగించాలని కోరారు. పాలంపేట గీత కార్మికులతో ఎక్సైజ్ అధికారులు కలెక్టర్ చర్చలు జరి పి న్యాయం చేయాలని రవిగౌడ్. యాదగిరి గౌడ్లు అన్నారు.ఈ కార్యక్రమంలో కోల సుధాకర్ గౌడ్, కోల శ్రీనివాస్ గౌడ్, బోనగానిల రమేష్ గౌడ్, తడుక బాబు గౌడ్,తడుక కుమార్ గౌడ్,కుడి కంటి శ్రీనివాస్ గౌడ్, ముత్యాల సదయ్య గౌడ్, జనగాం పద్మయ్య గౌ డ్, జనగాం రాజ కొమురయ్య గౌడ్, రాంబాబు గౌడ్, జనగాం రవి గౌడ్, మార్క జయశంకర్ గౌడ్, ఎల్లల బిక్షపతి గౌడ్, కుటి కంటి రాజు గౌడ్, బొమ్మ సాంబ య్య గౌడ్,రాపర్తి ఐలయ్య గౌడ్, రాపర్తి మోహన్ గౌడ్, కుమార్ గౌడ్, రాజు గౌడ్, రాజమౌళి గౌడ్, కొమురయ్య గౌడ్, పెరుమండ్ల రాజేందర్ గౌడ్, తదితర 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.