Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడారంలో ముఖ్య కార్యకర్తల విస్తతస్థాయి సమావేశం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్రావు
నవతెలంగాణ-తాడ్వాయి
ఆదివాసి అస్తిత్వం, మనుగడ రక్షణకై ఆదివాసీ లందరూ మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆది వాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు అన్నా రు. ఆదివారం మండలంలోని మేడారంలోని ఐటి డిఏ క్యాంప్ ఆఫీస్ మీటింగ్ హల్లో ఉమ్మడి వరం గల్ జిల్లాలోని ములుగు, వరంగల్ రూరల్, మహ బూబాబాద్ జిల్లా కమిటీల ఆదివాసి సేన మరియు అనుబంధ సంఘాల విస్తత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివాసి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలం గాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హా జరై మాట్లాడుతూ అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం వ్యక్తిగత హక్కులతో పాటు, ఆది వాసి గ్రామాలకు సామాజిక ఉమ్మడి హక్కులు, అట వీ వనరుల వినియోగ హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడేంలలో యప్అర్సి కమిటీల సమక్షంలో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి హక్కులు పోందే విధం గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి ఆదివాసి గూడేంలో పేసా చట్టం ప్రకారం గ్రామ సభ ల అనుమతితోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ లు చేయాలని తెలిపారు. గ్రామల అభివద్ధి పనులు జరగడం లేదని, ఇది ముమ్మాటికీ ఆదివాసులను అభివృద్ధి నుండి దూరం చేయడానికి, 5వ షేడ్యూల్డ్ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకుపోడానికి ప్రభుత్వం అధికారులతో కలిసి కుట్ర జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివాసీ షేడ్యూల్డ్ ప్రాంత చ ట్టాలను, హక్కులను ఉల్లంఘనకు గురి అవుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆది వాసీ సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడే వేంకటేశ్వర్లు, ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు కే.ఎ.కుమార్, ఉకే రవి, రాయిసిడం జంగుపటేల్, కాత్లె బుచ్చన్న, కోడప వామన్ రావు, వజ్జ జ్యోతిబాసు, యనక లక్ష్మి నారా యణ, చింత రవి, పోలబోయిన అది నారాయణ, కుర్సం వేంకటేశ్వర్లు, కల్తీ రామకష్ణ, పీరిల భాస్కర్, మంకిడి శ్రీను, కల్తీ నరేష్,కోడే లక్ష్మీ నారాయణ,గోంది రాజు పీరల రాజు తదితరులు పాల్గొన్నారు.