Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక న్యాయవేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణేఎం శోభన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
చట్ట సభల్లో ఆదివాసి గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలని సామాజిక న్యాయవేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెం శోభన్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక ముఖ్యుల సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెమ్ శోభన్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ములు గు జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన అదివాసీలు తెలంగాణ ఉద్యమంలో తమ సంస్కతి సంప్రదాయా లతో అలుపెరుగని ఉద్యమ పోరాటంచేశారు. ములు గు నియోజక వర్గంలో 70వేల పైచిలుకు జనాభా ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గంలో అదివాసీల కు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం భాదాకరం ఎంతో మంది యువకులు అదివాసీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి తెలంగాణ పార్టీకి మద్దతు నిచ్చారు. ములుగును గిరిజన జిల్లా చేసి నందుకు కెసిఆర్‌కు ధన్యవాదాలు చాల సందర్బాల్లో తెలుపడం జరిగింది. ఐనప్పటికి అదివాసీలను రాజ కీయంగా గుర్తించలేదని, ములుగు నియోజక వర్గం లో ఉన్నత చదువులు చదివి ప్రజలకు సంఘాలకు సేవ చేస్తున్న యువత ఎంతో మంది ఉన్నారని, తె లంగాణ ప్రభుత్వం గుర్తించి అదివాసీ లలోని యువ తకు శాసన సభకు గానీ పార్లమెంటు సభ్యులుగా అవకాశం కలిగించడం చాల అవసరం అని, తెలం గాణ ఉద్యమం లాగా పోరాటం చేసి సీటు ఇచ్చిన వ్యక్తులను గెలిపించి తీరుతామని, తెలంగాణ ప్రభు త్వాన్ని కెసిఆర్ సామాజిక న్యాయవేదిక ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెమ్ శోభన్ కోరారు. ఈ కార్యక్రమంలో బిల్ల మనోజ్ కుమార్ చీమల రమేష్, ఈక రాజు ఊకెవెంకన్న రామనాధం వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.