Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3.26 ఎకరాల కంది చేను పంట నష్టం - విచారిస్తున్న వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
నకిలీ పురుగు మందులతో రైతులు కుదేలవుతున్నా రు. చంటి పిల్లల్ల పెంచుకున్న పంట చేను పురుగు మం దు బారిన పడి పంట నష్టపోయి గుండెలు బాదుకుంటు న్నారు. పురుగుల మందు వ్యాపారులు రైతులను నిలు వునా ముంచుతూ కోట్లకు పడగలెత్తుతున్నారంటే ప్రభు త్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న నాయకుల మాటలకు విలువలేకుండా పోయిందనడానికి ఇదో నిదర్శనం. వివ రాల్లోకి వెళితే గ్రేటర్ వరంగల్ పరిధి వంగపహాడ్లో పింగిళి కొమురారెడ్డి అనే రైతు ఇదే గ్రామానికి చెందిన ఎండీ.యూనస్ హుస్సేన్‌కు చెందిన సర్వే నెంబర్ 455/1లో 1.31 ఎకరాలు, 456/2లో 1.36 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని కంది పంట వేసుకున్నాడు. జూన్ 19వ తేదీన విత్తిన పంట పూత దశలో పురుగు పట్టింది. దీంతో పురుగు నివారణ కోసం ఇదే గ్రామానికి చెందిన వాసుదేవ ఫెస్టిసైడ్ పురుగులు మందు దుకాణంలో కొరజిన్ మందు ఇవ్వమని అడగగా డీలర్ ఫార్మగార్డ్ అనే మందు వాడమని సలహా ఇచ్చాడని బాదిత రైతు తెలిపాడు. డిసెంబర్ 3వ తేదీన ఆ మందు కొనుగోలు చేసి నీటి వసతి లేకపోవడంతో డిసెంబర్ 9వ తేదీన పిచికారి చేసి పంట చేనుకు వా డినట్లు వ్యవసాయాధికారికి వివరించారు.మందు పిచికారి చేసిన 7రో జుల్లోనే పంటను పరిశీలించి చూడగా కంది చేను అంత ఎండిపోయి పంట పూర్తిగా దెబ్బతిందని వ్యవసాయాధికారి అనురాధకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన ఏవో అనురాధ, ఏఈఓ అనూషలు పంటను సంద ర్శించి పరిశీలించి పంట పూత దశ, లేతకాయ దశంలో ఉండి మొత్తం ఎండి పోయినట్లు గుర్తించారు. అనంతరం తదుపరి చర్యల కోసం వ్యవసాయ ఉన్న తాధికారులకు నివేధికను అందజేసి సంబందిత కంపెనీతో పాటు విక్రయించి డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఏఓ అనురాధ తెలిపారు.