Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రోజుల్లో ముగ్గురి మార్పు...
- కొత్త డీఈవో కోసం ఎదురుచూపులు ...
నవతెలంగాణ-మహబూబాబాద్
భావిభారత విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాశాఖకు బాస్ లేకుండా పోయారు. మహబూబాబాద్ జిల్లాకు డిఇఓ నియామకంపై తర్జనభజన కొనసాగుతుంది. ప్ర భుత్వ యంత్రాంగంలో ప్రధానమైన విద్యాశాఖకు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారి నియామకంపై సందిగ్ధత నెలకొంది. మహబూబాబాద్ డీఈవోగా డాక్టర్ అబ్దుల్ హై కొనసాగుతుండగా ఈనెల 5వ తేదీన ఖమ్మం డిఈఓగా విధుల్లో ఉన్న సోమ శేఖర్ శర్మను మహబూబాబాద్‌కు అదనపు డీఈవోగా ఎఫ్ఎసిగా నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. మానుకోటలో పనిచేస్తున్న డాక్టర్ అబ్దుల్ హైని హనుమకొండ జిల్లాకు బదిలీ చేశారు. అయితే ఖమ్మం జిల్లా కు డీఈవోగా ఉన్న సోమశేఖర్‌ను మహబూబాబాద్ డీఈవోగా అదనపు బాధ్య తలు ఇవ్వడానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అంగీకరించలేదు. దీంతో ఆయన రాకుండా పోయారు. ఇదే క్రమంలో మానుకోట డీఈవో అబ్దుల్ హై హనుమ కొండ జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మానుకోట జిల్లాకు డిఇఓ లేకుండా పోయారు ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన కొత్తగూడెం జిల్లా విద్యా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రామారావును మహబూబాబాద్ డీఈఓ గా నియమిస్తూ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఆయన వివిధ కారణాలు నేపథ్యంలో గత ఆరు నెలలుగా సెలవులో ఉన్నారు. నియామకం వచ్చిందే తడవుగా రామారావు మహాబూబాబాద్ జిల్లా డీఈవోగా విధుల్లో చేరడానికి బయలుదేరగా ఇంటి ముందు ప్రమాదం జరిగి ఆయన ఖాళీ బొటనవేలుకు గాయమైంది. డాక్టర్‌ను సంప్రదించగా కనీసం నెల రోజులు కాలు కదపకూడదని చెప్పారు. ప్రాథమిక చికిత్స చేసుకొని మహబూబాబాద్‌కు విధుల్లో చేరడానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ శశాంక్‌ను కలిసి తన కాలికి గాయం అయిందని విధుల్లో చేరి నెల రోజు సెలవు పెట్టి వస్తానని చెప్పగా కలెక్టర్ శశాంక్ అంగీక రించలేదు. ఇప్పటికే విద్యాశాఖ ఎస్ఎస్సి ఫలితాలలో వెనుకబడిందని ఆ కాళి గాయం నెల రోజులతో పోయేది కాదు కనీసం మూడు నెలలు పడుతుంది అని సెలవు ఇచ్చేది లేదని ఖరాకండిగా చెప్పారు. దాంతో ఏం చేయాలో తెలియక రామారావు డీఈవోగా విధుల్లో చేరకుండానే వెళ్ళిపోయారు. ప్రస్తుతం మహ బూబాబాద్ ఇంచార్జి డీఈవోగా అబ్దుల్ హైనే కొనసాగుతున్నారు. కొత్త డీఈవో నియామకం కోసం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణకు లేఖ రాసి నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ గత 15 రోజులుగా మహాబూబా జిల్లాలో డీఈవో లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. విద్యా రంగంలో పూర్తిగా వెనకబడి ఉన్న మహబూబాబాద్ జిల్లాకు పూర్తిస్థాయి డీఈఓ ను కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. అయితే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతానికి విద్యాశాఖలో పూర్తిస్థాయి డీఈవోలు 12 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 21 జిల్లాలకు లెక్చరల్లే డీఈ వోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన సోమశేఖర్ శర్మ తోపాటు డాక్టర్ అబ్దుల్ హై లు ఇద్దరూ లెక్చరర్లే కావడం గమనార్హం. ఇప్పటికే జిల్లా వ్యా ప్తంగా 18 మండలాలు ఉండగా కొత్తగా ఏర్పడిన సిరోలు, ఇనుగుర్తి మండలా లకు అసలు ఎంఈఓలను కేటాయించలేదు. పాత 16 మండలాలకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఎంఈఓలుగా కొనసాగుతున్నారు. మహబూ బాబాద్ ఇన్చార్జ్ ఎంఈఓకు 7 మండలాల అదనపు ఎంఈఓ గా బాధ్యతలు ఉన్నాయి. ఇది విద్యాశాఖ పరిస్థితి మాకు కోట దుస్థితి.