Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యురాలి నిర్లక్ష్యమే కారణం : కుటుంబీకులు
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట పట్టణ పరిధి నెక్కొండ రోడ్డులోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పసికందు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకొంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆత్మ కూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన గర్భిణి హర్షమల్లు తేజ ప్రసూతి కోసం బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. వైద్యురాలు బి పూర్ణిమ ప్రసూతి చేసిన తర్వాత తేజకు ఆడపిల్ల జన్మించింది. అప్పటి వరకు పుట్టిన పసికందు ఆరో గ్యంగానే ఉందని వైద్యురాలు చెప్పారు. కొద్దిసేపటికే పసికందు మృతి చెందినట్లు రోదిస్తూ చెప్పారు. వైద్యురాలు పూర్ణిమ సకాలంలో సరైన పద్దతిలో ప్రసూతి చేయకపోవడం వల్లే పుట్టిన పసికందు మృతి చెందినట్లు బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఇదే విషయమై వైద్యురాలిని నిలదీసేందుకు వెళ్తుండగా ఆసుపత్రి సిబ్బంది అడ్డగించారు. వారితో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. అక్కడి నుంచి బాధిత కుటుంబ సభ్యులు పోలిసు స్టేషన్లో ఫిర్యాదు చేయ డానికి వెళ్లారు. ఈ సంఘటనపై ఇరువురికి చెందిన కొందరు మధ్యవర్తిత్వం వహించి రాజీ ప్రయత్నం చేసినట్లు సమాచారం.