Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని విద్యార్థి ప్రగతి, ఉపాధ్యాయుల పురోభివృద్ధికి అనుకూలంగా తీర్చిది ద్దుకోవాలని ఉపాధ్యాయులు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని, ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు ఉండవని, ఈ విషయంలో విద్యాశాఖ కమిషనర్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పీఆర్టీయూ రాష్ట్రశాఖ అధ్యక్షులు ఎం చెన్నయ్య అన్నారు. ఆదివారం మడికొండలో జరిగిన పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా చెన్నయ్య హాజరై మాట్లాడారు. బదిలీలు, ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి పలుమార్లు ప్రాతినిధ్యం చేస్తున్నామని, ముఖ్య మంత్రితో మాట్లాడి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే విధంగా చూస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో సింగరేణి కోల్ మైన్స్ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్ ఇప్పించేలా ప్రభుత్వాన్ని కోరతా మన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమ స్యలు ప్రభుత్వం పరిష్కరించే విధంగా చూస్తున్నా మన్నారు. మ్యూచువల్ బదిలీల ద్వారా విడోస్ బది లీల ద్వారా కొంత సమస్య పరిష్కారం అయిందని, మిగిలిన అప్పీల్స్ పరిష్కరించేలా ప్రయత్నం చేస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర రావు, రాష్ట్ర బాధ్యులు రంగనాయకమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దావు రమేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావులకార్ వెంకటేష్, ప్రధానకార్యదర్శి రాజేశ్వరయ్య చారి, ములుగు జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ జ్యోతి, ప్రధాన కార్యదర్శి తాడిచర్ల రవి, జనగామ జిల్లా అధ్యక్షులు సురేందర్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్, మన్నె చంద్రయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.