Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని వేములపల్లి, మెట్టుపల్లి, ఎల్లారెడ్డిపల్లి పిడిసిల్ల గ్రామానికి ఆదివారం విశారదన్ మహరాజ్ స్వరాజ్య పాదయాత్ర సందర్బంగా పలు గ్రామాలల్లో డీఎస్పీ జెండాలు ఆవిష్కరించి మాట్లా డారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో కాన్షిరాం జన్మదినం గత మార్చి 15న ప్రారంభమైన స్వరాజ్య పాదయాత్ర 23 జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని 24న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించిందని అన్నారు. తెలంగాణలో అగ్రకులాల చేత దోపిడీ దౌర్జన్యాలకు అన్యాయాలకు గురవుతున్న అణగారిన వర్గాలకు రాజకీయ, ఓటు చైతన్యం ద్వారా స్వరాజ్యం స్థాపించే లక్ష్యంతో ముందుకు సాగు తుందన్నారు. అగ్రకుల రెడ్డి,రావుల పాలనకు చరమ గీతం పాడి అట్టడుగు వర్గాల రాజ్యాన్ని స్థాపించేందుకు బీసీ ఎస్సి ఎస్టీ సబ్బండ కులాలు ఏకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిల్లా అధ్యక్షులు రవీందర్, రవి, సారయ్య ముదిరాజ్, శ్రీనివాస్, రవికుమార్ గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.