Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బిఆర్ఎస్లో ఇద్ద రు మాజీ డిప్యూటీ సిఎంల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అమీతుమీకి సిద్దపడడంతో పొలిటికల్ వార్ హీటెక్కింది. వ్యక్తిగత ఆరోపణలకు సై అంటే సై అంటున్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు అని ప్రక టించడంతో ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య వర్గంలో హ ర్షం వ్యక్తమైనా, కొంత గుబులు కూడా కనిపిస్తుంది. సీ ఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని రా జకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడంతో అటు 'క డియం', ఇటు 'తాటికొండ'ల మధ్య ఆధిపత్య పోరు కొన సాగుతుంది. బిఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలి కార్యక్ర మాలు నిర్వహించుకోవడం ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ కు దారితీసింది. 'తాటికొండ' స్టేషన్‌ఘన్‌పూర్ తన అ డ్డా అని చాటుతుంటే.. నీఅడ్డా అయితే పార్లమెంటు ఎ న్నికల్లో నీ కంటే నియోజకవర్గంలో నాకు ఎందుకు భారీ మెజార్టీ వచ్చింది ? అని ప్రశ్నించారు. దీంతో వీరిద్దరి స యోధ్య కుదర్చడం సాధ్యం కావడం లేదు. ఏదేమైనా 'స్టేషన్'లో ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంల వ్యూహాత్మక ఆ రోపణలు, చాలెంజ్‌లు ఆసక్తికరంగా మారాయి.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంల మధ్య ఆధిపత్యపోరు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి వరంగల్జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా తొమ్మిదేళ్లపాటు సింగిల్ మంత్రిగా చక్రం తిప్పిన కడియం శ్రీహరికి ఇటీవలి రాజకీయ పరిణామాలు మిం గుడుపడడం లేదు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న సంకల్పం గత రెం డు ఎన్నికల్లో ఆయనకు దక్కకపోవడం ఒకసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్సీతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. ఎంపీ గావున్న నాడు డిప్యూటీ సిఎంగావున్న డాక్టర్ తాటి కొం డ రాజయ్యను బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సిఎంగా చేసి అనంతరం ఎమ్మెల్సీ అ వకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించడం గమనార్హం. అంత గా చక్రం తిప్పిన 'కడియం'కు గత కొన్నేళ్లుగా చేదు అను భవాలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలోనూ 'కడియం' , 'తాటక్ణొడ'లు పరస్పరం ఆరోపణలు గుప్పిం చుకుంటున్నారు. దీంతో బిఆర్ఎస్ రెండు వర్గాలుగా చీ లిపో యి వేర్వేరు కా ర్యక్ర మాలను నిర్వ హిం చుకోవడం సర్వ సాధారణమైంది. 'కడియం' ఆత్మీయ సమ్మేళనాలను నిర్వ హిస్తూ క్షేత్రస్థాయి లో తనకున్న సం బం ధాలను కొనసా గిస్తున్నారు. 'తాట ికొండ' గ్రామస్థాయి పర్యటనలు చేస్తూ తాను చేసిన అభివృ ద్ధి ని ప్రచారం చేసుకుంటున్నారు.
మాజీ డిప్యూటీల మధ్య పోరు..
స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఇద్దరు నేతలు డిప్యూటీ సిఎంలుగా పనిచేయడం, ఎమ్మెల్యే టికెట్ కోసం వీరిద్దరి మధ్య హౌరాహౌరా పోటీ నడుస్తుండడం రాష్ట్రస్థా యిలో చర్చనీయాంశంగా మారింది. 'తాటికొండ'పై వు న్న ప్రజావ్యతిరేకతను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువస్తూ 'కడియం' తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 'తాటికొండ' నియోజకవర్గంలో తనకే బలం అధికంగా వుందని చాటుతూ, ఎమ్మెల్సీలకు అభివృద్ధి చేసే అవకాశముండదని ప్రచారం చేస్తూ 'కడి యం'ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక దశలో టిడిపిలో మంత్రిగా వున్న 'కడియం' 361 మంది నక్సల్స్‌ను ఎన్కౌంటర్ చేయించారని ఆరోపించడం దు మారం రేపింది. దీంతో 'కడియం' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో అధిష్టానం సైతం మందలించడంతో 'తాటికొండ' మౌనముద్ర దాల్చినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల ఈ ఇద్దరు నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం పరోక్షంగా సాగుతుంది. ఇద్దరు నేతలు క్షేత్రస్థాయి పర్యటనలతో వచ్చే శాసనసభ ఎన్నికలకు సమాయత్తమ వుతున్నారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం రెండు వర్గాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ నేతకే టికెట్ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
అధిష్టానానికి తలనొప్పి..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ టికెట్ ను ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంలు ఆశిస్తుండడం బిఆర్ ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ఇంటెలిజె న్స్ నివే దికలు తెప్పించుకుంటున్నారు. ప్రజావ్యతిరేకత వున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్న దశలోనే సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే మళ్లీ పా ర్టీ టికెట్లు ఇస్తామని ప్రకటించడం గమనార్హం.
ఈ ప్రకటన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపినా, తరువాత సిట్టింగ్‌లకు ఈ ప్రకటన రాజకీయ వ్యూహంతో చేసిందేనన్న భావనకు వచ్చారు. ఇదే క్రమం లో పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతలు సైతం తమకున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాత్రం ఇద్దరు నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలను పెంచారు.
'కడియం' తాను మంత్రిగా వున్న నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చా టుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు నేతల పర్యటనలు మరోమారు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరమైన చర్చ కు దారితీసింది.