Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ హబ్‌గా భూపాలపల్లి
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
వైద్యరంగానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మె డికల్ హబ్‌గా భూపాలపల్లి అవతరించిందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి ప్రాంగణంలో రూ.3.60 కోట్లతో కేంద్ర ఔషధ గిడ్డంగి, రూ.37 లక్షలతో రోగుల అటెండెన్స్ షెడ్ నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దే శంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రజల సౌకర్యార్థం సం క్షేమ పథకాలతోపాటు వైద్య, విద్య,ఉపాధి కల్పనకు చర్యలు తీసు కుం టున్నారన్నారు. వంద పడకల ఆసుపత్రిలో మాతా శిశు కేం ద్రంతోపాటు అన్నివైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉ న్నాయని తెలిపారు. ఇప్పటికే భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందని పనులు ముమ్మరంగా కొనసాగు తున్నాయన్నారు. పలు మండలాల్లో నూతనంగా పీహెచ్‌సీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచాన్ని గడగడలా డించిన కరోనామహమ్మారిమళ్ళీ కొత్తవేరియంట్గా వస్తున్న నేప థ్యంలో జిల్లా వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టిఆర్ఎస్ నాయకులు కళ్లెపు రఘుప తి రావు, మందల సాగర్‌రెడ్డి, కటకం జనార్ధన్, కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, ముంజాల రవీందర్ ,కురిమిళ్ళ రజిత శ్రీనివాస్, శిరుప అనిల్ లతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.