Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్
నవతెలంగా-కాజీపేట
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరా టాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ భా స్కర్ అన్నారు. కోచ్పరిశ్రమ ఏర్పాటు చేయమని తెగేసి లిఖిత పూర్వకంగా సమా ధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా కాజిపేట చౌరస్తాలో బీ ఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభు త్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని కేంద్ర బిజెపి ప్రభుత్వ మొండి వైఖరి ని ఖండించి,అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంద ర్భంగా వినమ్ భాస్కర్ మాట్లాడుతూ దశాబ్దాల నుండి ఆనాడు కాంగ్రెస్ ప్రభు త్వం ఈనాడు బిజెపి ప్రభుత్వం కాజిపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలపై మండిపడ్డారు. 1980అప్పటి ప్రధాని పీవీ నరసిం హారావు కాజీపేటకు ఫ్యాక్టరీని మంజూరు చేస్తే అప్పుడు అయోధ్యపురం మడికొం డ పరిసర ప్రాంతాల్లో స్థలసేకరణ కూడా ప్రతిపాదనలు చేశారు కానీ అప్పుడు పంజాబ్ అల్లర్ల ను తగ్గించడానికి డొంగోవాలా ఒప్పందం ప్రకారం కాజీపేటకు మంజూరైన ఫ్యాక్టరీని పంజాబ్‌కు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందని తె లిపారు. తెలంగాణ ప్రజలు మా విభజన హక్కులను పొందేందుకు అలాగే మా ప్రాంతానికి లబ్ధిని చేకూర్చే కోచ్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై దశల వారికి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కాజిపేట ప్రాంత ప్రయోజనమైన కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం మేము సైతం పలువురు యువకులు భారత రాష్ట్ర సమితిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, మాజీకూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్,కాజిపేట రైల్వే కోచ్ సాధన సమితి నుండి పలువురు సభ్యులు, పలువురు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.