Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో భూములు పంచిన ఘనత మాదే : సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
దేశంలో త్యాగాల పునాదులపై ఏర్పడి, ప్రజా పోరాటాలే ఊపిరిగా ముందుకు సాగు తున్నపార్టీ సీపీఐ అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భార త కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం హను మకొండ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వెయ్యి స్తంభాల దేవా లయం నుండి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలమంది సిపిఐ కా ర్యకర్తలు ఎర్రచొక్కాలు, మహిళా కార్యకర్తలు ఎర్రచీరలు ధరించి పాల్గొన్నారు. అనంత రం పబ్లిక్‌గార్డెన్ వద్ద జరిగిన సభలో చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డుతూ పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకు ప్రజల కోసం అలుపెరుగని పోరాటాలు సిపిఐ నిర్వహిస్తున్నదని అన్నారు.దున్నే వాడికే భూమి అన్న నినాదంతో తెలంగాణలో గ్రామ గ్రా మాన భూములు పంచిన ఘనత సిపిఐ దేనని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో 10లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్ట సభలలో, బయటా పోరాడుతున్న పార్టీ సిపిఐ అన్నారు. కూడు,గూడు, గుడ్డ కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ భాద్యతను విస్మరించినందునే పేదలకు 60 గజాల స్థలంకోసం భూ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. డబుల్ బెడ్రూంలు, ఇందిర మ్మ ఇండ్లు పేదలకు అందలేదని, అందుకే ఎర్ర జెండా నీడన ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా జీవో 58 ప్రకారం పేదలకు ఇండ్ల పట్టాలు ఇ చ్చి,ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందిం చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పేదల జీవి తాలు సంక్షోభంలో పడ్డాయని, మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకు దేశ సంపదను అప్పగి స్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు.
దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో అణిచివేత కొనసాగుతున్నదని అన్నారు. అందు కే ఎర్రజెండా ఆధ్వర్యంలో భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముందుకు సాగాలని కోరా రు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, మాజీ ఎ మ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తో ట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, ఆదరి శ్రీనివాస్, ఉ ట్కూరు రాములు, మండ సదాలక్ష్మి, దుప్పటి సాంబయ్య, కొట్టెపాక రవి, మాలోతు శంక ర్, కె.వెంకటరమణ, రాజ్‌కుమార్, వేల్పులప్రసన్న, స్వరూప, దీనా, జ్యోతిలు పాల్గొన్నారు.