Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పోలంపేట గ్రామ శివా రులో గల యూనిస్కోగుర్తింపుపొందిన రామప్ప దేవాలయం సందర్శన కు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. ఈ సంద ర్భంగా సోమవారం రామప్ప లో జిల్లా కలెక్టర్ ఎస్ కష్ణ ఆదిత్య ఏ ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకేన్ అదనపు కలెక్టర్ వైవి గణేష్ ల తో కలిసి రామప్ప లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లా డుతూరాష్ట్రపతి పర్యటనకు రామప్ప దేవాలయం సుందరీకరణతో అలం కరణ పూర్తిచేసామని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి రామప్ప సందర్శనకు విచ్చేస్తున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి ప ర్యటన ఉంటుందని అన్ని ఏర్పాట్లు బార్కెట్లు పార్కింగ్ ఏరియా వాటి వివ రాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని తెలిపారు. ఈనెల 28న రామప్ప రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ములుగు గిరిజన జిల్లా అయినందున ఆదివాసి కళాబందాలతో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు వివరించారు. ఏర్పాట్లలో నిమగమైన అన్ని శాఖల అధికా రులకు దిశానిర్దేశం చేస్తూ ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వివరా లు తెలిపారు. రామప్ప గార్డెన్ అందంగా తీర్చిదిద్దినట్లు అదేవిధంగా తా గునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామప్ప ప్రాంగణంమంత శానిటైజర్ అంతర్గత కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ ప్రత్యేక సిబ్బంది ని నియమించడంతో పాటు అనేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపా రు. భద్రత చర్యలో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలను అన్ని విధాల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రామప్ప పరిసర ప్రాంతాల్లో నిషేధం ఆజ్ఞలు జారీ చేశారు. రామప్ప ఆలయం ప్రతిభాగాన్ని పర్యవేక్షించారు. రామప్పపర్యటన నేపథ్యంలో భ ద్రత ఏర్పాట్లకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. రామప్పలో అన్నిఏర్పాట్లు ముమ్మరం చేసి పూర్తి చేసిన అన్ని శాఖలతో స మన్వయం చేసుకుంటూ రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయనున్నా మని మూడు హెలిప్యాడ్లు ల్యాండ్ అయ్యే విధంగా స్థలం ఏర్పాట్లు పూర్తి అయినట్లు హెలిప్యాడ్ ప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి తని ఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రామప్పలో పటిష్టమైన భద్రత ఏర్పా టు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట డిఆర్ఓ కె.రమాదేవి, డిపిఓ కె.వెంకయ్య, పంచాయతి రాజ్ ఈఈ రవీందర్, ఆర్అండ్బి ఈఈ వెంకటేష్, డిఈ ఇరిగేషన్ వెంక ట కృష్ణారావుకు, పాలంపేట సర్పంచ్ డోలి రజితశ్రీనివాస్ సంబంధిత శా ఖ అధికారులు తదితరులు ఉన్నారు.