Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మందసంపత్
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో కేవీపీఎస్ జిల్లా క మిటీ ఆధ్వర్యంలో మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టడం జరి గింది. అనంతరం కేవీపీఎస్ హన్మకొండజిల్లా కార్యదర్శి మం దసంపత్ మాట్లాడుతూ మనుషుల మధ్య అఘాతంలా ఉ న్న ఈ మనుస్మృతి సమాజానికి పట్టినచీడ లాంటిదని సమా జంలోని ప్రజల మధ్యకులాలుగా మతాలుగా వర్గాలుగా విభ జన చేసి గొడవలు సష్టించి.. సంపదలో భాగమైన మెజార్టీ వర్గమైన శ్రామికవర్గాలను బానిసలుగా వెట్టిచాకిరి చేసేవా రుగా చిత్రీకరించి అగ్రవర్ణ బ్రాహ్మణిజం అయినా అతి కొద్ది మంది అధికారం చలాయించే విధంగా ఉన్న ఈ అజ్ఞాన శా స్త్రాన్ని తగలబెట్టాలని.. దాన్ని నాశనం చేసి మనుధర్మ పునా దులపై సమ సమాజం స్థాపించాలని పిలుపునిచ్చారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలన చేస్తూ ప్రజల మధ్య భేదాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతుందని. బ్రాహ్మణీయ వ్యవస్థ కోసం పెత్తనం కోసంవర్ణాశ్రమ ధర్మాలను ముందుకు తీసుకు వ స్తూ శూద్రులను మళ్లీ శూద్రులుగా కులాల వారీగా వత్తుల వారిగా విభజించి పరిపాలన చేస్తుందని దానికోసం అనేక విధాలుగా ప్రశ్నించిన వారిపై, మైనార్టీ వర్గాలైన దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలపై దాడులు జరుపుతుందని, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మనువాద రా జ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అలా జరిగితే ప్రజలు మళ్లీ అజ్ఞానంలోకి నెట్టబడి బానిసలుగా నిరక్షరాశులుగా నిరుద్యోగులుగా, స్త్రీలు అనేక హక్కులు కూ లిపోయి వంటింటి కుందేళ్ళ వలె పిల్లల్ని కనిపించే యంత్రా లుగా మారిపోతారని పేదలు మరింత పేదలుగా మారిపో తారని అందుకే కెవిపిఎస్ హన్మకొండ జిల్లా జిల్లా కమిటీ ఈమనువాద వ్యతిరేక పోరాటంలో ముందుండి. మనుస్మృతి ని ధ్వంసం చేసి భారత రాజ్యాంగ రక్షణ కోసం మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తుందని ఆ పోరాటంలో అన్ని వర్గాల ప్ర జలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎం.చు క్కయ్య, నోముల కిషోర్, తొట్టె మల్లేశం, గొడుగు వెంకట్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య, ఉపాధ్యక్షు లు దూడపాక రాజేందర్, రసిపాక రంజిత్, సంపత్, అరిగి రవి, శ్రీను, బొట్ల కుమార్ పాల్గొన్నారు.