Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
- ఆత్మీయ సమ్మేళనంలో ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
నవతెలంగాణ-ములుగు
గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క తెలిపారు.ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ములుగు మండల 33 గ్రామాల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి గ్రామ జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకు పోయే విధంగా ప్రతి ఒక్కరూ కష్ట పడలని అన్నారు. నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులకు నేను రుణపడి ఉంటానని మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని కష్ట పడి పని చేసిన వారికి పార్టీలో మంచి గుర్తింపు వస్తుంది తప్పకుండా రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీనికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.ములుగు మండలం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కషి చేస్తూ నిరంతరం పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి లను ఎమ్మెల్యే సీతక్క శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి తో పాటు 33 గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.