Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
- కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి
- ప్రతీ మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలి
- పాలకుర్తిలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
మహిళల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డ్వాక్రా మహిళలకు ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర పంచా యతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం డిఆర్డిఓ పిడి గూడూరు రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అభివద్ధి సం క్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి డ్వాక్రా మ హిళ వ్యాపారవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో ఐదు కోట్ల వ్యయంతో పాలకుర్తి నియో జకవర్గంలో మూడు వేల మందికి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం రాష్ట్రంలోనే పాలకుర్తిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయమన్నారు. కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే మహిళా అబివృద్ధికి సార్ధకత ఉంటుందని తెలిపారు. గత పాలకులు మహిళా సంక్షేమాన్ని విస్మరించా రని, మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారని తెలిపారు. సమైక్య పాలనలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ 40000 కోట్లతో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించి త్రాగునీటి కొరతను తీర్చాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో మహిళల ప ట్ల దాడులు, అరాచకాలు తగ్గాయని తెలిపారు. సమైక్య పాలనలో బడ్జెట్లో మహిళ అభివద్ధికి నాలుగు వేల కోట్లు కేటాయించే వారని, తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం 18 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాక్రా సంఘాలు మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ స్ఫూర్తితో మహిళలు ఆర్థి కంగా ఎదిగి, ప్రతి వస్తువును తయారు చేసే వ్యాపారవేత్తగా ఎదగాలని సూచిం చారు. మనం పండించే పంటలతో మనమే వ్యాపారం చేసుకుని మధ్య దళారీల బెడదను తీర్చాలని సూచించారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించడంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సాటి లేరని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమంలో సీఎం కేసీఆర్ అనుమతితో రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ నిధులు కే టాయిస్తున్నానని తెలిపారు. మహిళ అభివృద్ధి కోసం శ్రీనిధి పథకంలో ఒక్కో మ హిళకు మూడు లక్షలు రుణాలు అందిస్తున్నామని రుణం తీసుకున్న మహిళ ప్ర మాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదే శించారని తెలిపారు. చెల్లించిన అప్పులో కుటుంబ సభ్యులకు తిరిగి ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అభయస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సంఘం మండలంలో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కులో అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపట్ల దేశం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశారు, ఘన్పూర్ ఆర్డీవో కష్ణవేణి, ఏపీడి నూరొద్దీన్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ఎంపీపీలు నల్ల నాగిరెడ్డి, ధరావత్ జ్యోతి, బస్వ సావిత్రి మల్లేశం, జిల్లా కోఆష్సన్ సభ్యులు ఎండీ మదార్, బంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, పాలకుర్తి, దేవరుప్పుల జడ్పిటిసిలు శ్రీనివాసరావు, పల్ల భార్గవి సుందర్రామిరెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, ఐలమ్మ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, జిసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసు నూరి నవీన్, పాలకుర్తి, తొర్రూర్ సొసైటీల చైర్మన్లు బొబ్బల అశోక్ రెడ్డి, మైసిరెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు గిరగాని సుధా, డిపిఎంలు రాజేంద్రప్రసాద్,సమ్మక్క, ఏపీఎం రాచకొండ రమణాచారితోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, డ్వాక్రా మ హిళలు, ఐకెపి అధికారులు పాల్గొన్నారు.