Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
గ్రీన్ ఇండియా ఛాలెం జ్ అవార్డు గ్రహీత, వనప్రే మికుడు నల్లగొండ సమ్మ య్యను ఆదర్శంగా తీసుకు ని, ప్రతి ఒక్కరూ భాధ్యతగా మొక్కలను నాటాలని సీని యర్ జర్నలిస్ట్ ఈదునూరి మహేష్ అన్నారు. మండల కేంద్రంలో మహేష్ జన్మది నోత్సవం సందర్భంగా సమ్మయ్య ఆధ్వర్యంలో స్థానిక పంచముఖ ఆంజనే యస్వా మి ఆలయ సమీపంలో రామసీతాఫలం మొక్కను నాటారు. ఈసందర్భం గా మహేష్ మాట్లాడుతూ సమ్మయ్య జీవన ఆధారానికి మూగజీవాలైన పశువుల కు గోపాలమిత్రగా సేవలనుఅందిస్తూ, ప్రవృత్తిగా మొక్కలను నాటి, సంరక్షించ డమే తన జీవిత ఆశయంగా మలుచుకున్న, మహానుభావులని కొనియాడారు.
రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంకార్యక్రమానికి తనవంతు భాద్యతగా వందశాతం అమలయ్యేందుకు మొక్కలను నాటుతున్న సమ్మయ్య సేవలను ప్రభుత్వం గుర్తించి, మరింత ఉత్సాహంతో సేవలను అందించేందుకు ఆర్థిక సహాయంతో పాటు తగిన సత్కారాలు అందించాలని కోరారు.