Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
విద్యార్థి ఉద్యమకారుల జోలికి వస్తే తరిమి కొడతామని కేయూ విద్యార్థి జాక్ చైర్మన్ ఇట్లబోయిన తిరుపతియాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థాని క అమరవీర మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమకారుడు మాచర్ల శరత్చంద్ర పై పెట్టిన అక్ర మ కేసును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విరమించుకోకపోతే మిత్తి తో సహా ప్రజల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రెండు కంపెనీల పేరిట పదివేల క్యూబిక్ మీటర్ల మట్టి మొరం అనుమ తి పొంది మూడు లక్షల క్యూబిక్ మొరం దందా చేసి కోట్లు సంపాదించుకుంటు న్నారన్నారు.ఎన్నికల్లో విద్యార్థులు ఉద్యమకారులను ఎన్నికల కోసం వాడుకొని వది లేసి ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టడం తన రాజకీయానికి సరికాదని అ న్నారు. రాజకీయంలోకి రానప్పుడు ఎమ్మెల్యే స్థితి ఏంటో గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యమం కోసం పోరాడి పాటుపడిన విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టినట్లయితే కేయూ జాక్ తరఫున పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదంపాక విజరు ,టిజిబిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్ ,కేయూ జాక్ నాయకులు మొగిలి, వెంకట్రెడ్డి ,రాజేందర్ ,వంశీ ,శ్రీధర్ ,తదితరులు పాల్గొన్నారు.