Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గొర్రెల మేకల పరిశోధన కేంద్రాన్ని ఎత్తివేసి ఆలోచనలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ గొర్రెలమేకల పెంపకం సంఘం హనుమకొండ జి ల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం రోజున హనుమకొండలోని రామనగర్ లో ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న గొర్రెల పెంపకందర్ల కోసం దక్కన్ నల్లజాతి గొర్రెల అభివద్ధి కోసం 1964 లో కేటాయించిన పరిశోధన కేంద్రానికి సుమారు 300 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించారు. అందులో గొర్రెల అభివద్ధి కోసం గొర్రెల్లో వస్తున్న రో గాలకు నివారణ, మంచి విత్తన పొట్టేళ్ల తయారీ కో సం ఈ పరిశోధన కేంద్రం అనేక పరిశోధనలు నిర్వ హించిందని అలాంటి పరిశోధన కేంద్రానికి కేటా యించిన 300ఎకరాలస్థలాన్ని దశలవారీగా యూని వర్సిటీకి, మహిళా సమాఖ్య కేంద్రానికి బైపాస్ రోడ్డు వెళ్ళుటకు రహదారికోసం పోగా మిగిలిన 30 ఎకరా ల స్థలాన్ని కోర్టుల సముదాయానికి పీపీలు జడ్జీలు నివాస క్వార్టర్స్ కు కేటాయించి నారు . నోరు లేని గొర్రెల కాపరులను బజారుకీర్చారని తక్షణమే గొర్రెల పరిశోధన కేంద్రం తరలించడం ఉపసంహ రించుకో వాలని గొర్రెలపెంపకదారుల సంగం హను మకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.దక్కన్ నల్లజాతి గొర్రె ల అభివద్ధి కోసం ఉన్ని గొర్రెల అభివద్ధికై ఈ కేంద్రా న్ని గత ప్రభుత్వాలు ప్రారంభిస్తే తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఎత్తివేయడా నికి ఆలోచన ఉపసంహరించుకోవాలని గొర్ల కాపరు లు గుట్ట ఒకరు పుట్టకొకరుగా గొర్రెలను కాస్తూ మం చి నాణ్యమైన మాంసాన్ని ఉన్నిని సమా జానికి అందిస్తున్నారని ఆ రకంగా గొర్రెల కాపరుల అభివద్ధి కోసమని కాపరు లకు గొర్రెలు ఒకవైపు ఇస్తూ ఇంకో వైపున గొర్రెల కాపరులకు తోడ్పాటు అందిస్తున్న పరిశోధన కేంద్రం తర లించడం ఉప సంహరించు కోవాల ని వారు హెచ్చరించారు.
అదేకాక కురుమ యాదవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా గొర్రెలపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి పరిశోధన కేంద్రం ఎత్తివేయడం వల్ల యావత్తు అన్ని వర్గాల వారికి ఇబ్బందులు వస్తాయని గొర్రెలకు వచ్చే రోగాల నివారణ మంచి నాణ్యమైన పొట్టేళ్ల తయారీ కొత్త వంగడాలను అభివృద్ధి చేసే ఈ పరిశోధన కేం ద్రా న్ని యధా స్థానంలో కొనసాగించ ాలని , గొర్రెలకు అవసరమైన గడ్డి విత్తనాలు ఇతర మొక్క లను పెంచడానికి నూతన పరిశోధనలు జరిపి కొత్త కొత్త గడ్డి విత్తనాలు తయారు చేసే పరిశోధన కేంద్రం యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.పరిశోధన కేంద్రాన్ని తరలించొద్దని వారు డిమాండ్ చేశారు.