Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ అధినే త్రి సోనియా గాంధీ ద్వారానే సాకారం అవుతుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అం కుష్ అన్నారు. కాజీపేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యక ర్తల సమావేశం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ కాలనీలో నాయకులు మేకల ఉపేందర్ నివా సంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మ హమ్మద్ అంకూస్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ట్రై సిటీలో భాగమైన, ఉత్తర దక్షిణాలకు వారధిగా ఉన్న కాజీపేట ప్రాంతాన్ని అభి వృద్ధి చేయాలని, కాజీపేట బస్టాండ్, బస్‌డిపో వాగ్దా నం నెరవేర్చాలని అన్నా రు. కాజీపేటకు కోచ్ ఫ్యా క్టరీ, తెలంగాణ విభజన చట్టంలో పొందుపరచినా నేటికీ అమలు కాలేదని కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సోని యాగాంధీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎన్నో ఏళ్లుగా ఉద్య మాలుజరిగినా తెలంగాణ యువత భవిష్యత్తు కొరకు రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని, నిరుద్యోగులకు ఇబ్బందులు కలగకుండారాష్ట్ర విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగిందన్నారు. ఐదు దశాబ్దా లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని పార్టీలకతీతంగా ఉద్యమాలు చేసినటువంటి నాయ కులు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధించ లేకపోవడం విడ్డూరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడానికి ప్రస్తుతం కాజీపేటలో పోస్ట్ ఫ్యా క్టరీ నెలకొల్పాలని ఉద్యమాల పేరిట మోసం చేస్తు న్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. గత నాలుగు రోజుల క్రితం పార్లమెంటులో టిఆర్ ఎస్ ఎంపీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న రైల్వే కో చ్ఫ్యాక్టరీని నెలకొల్పాలని అడగడం, కేంద్రం ఇవ్వల మని చెప్పడం జరగనున్న ఎన్నికలలో దృష్టిలో ఉం చుకొని ఆడుతున్న నాటకాలన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా పా ర్లమెంట్ సాక్షిగా చట్టం చేయబడిన పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా ప్రజలను, నిరుద్యోగ యువత ను, మోసం చేశారని అన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ని ర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల ఉపేందర్, ఎంవి రాజు, ఇప్ప శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, క్రాంతి భరత్,బుర్రబాబురావు, మహమ్మద్ రహమ తుల్లా, మధు, కే.సమ్మయ్య, బుర్ర తిరుపతి, అఫ్జల్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.