Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
పవిత్ర క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అరూరి గట్టుమల్లు మెమోరి యల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని సుమారు 400మంది చర్చి పాస్టర్లకు హంటర్‌రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏజిఎఫ్ సెక్రెటరీ అరూరి విశాల్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అరూరి విశాల్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఎమ్మెల్యే స్వంత నిధులతో అరూరి గట్టుమల్లు మె మోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని చర్చి ఫా స్టర్లకు బట్టలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వర్దన్నపేట నియోజకవర్గ ప్రజలపై ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండేలా ఫాస్టరలందరు ప్రత్యేక ప్రార్థనలు చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజిఎఫ్ సీఈవో కొయ్యడ రాజు, కోశాధికారి ఇల్లం దుల సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కాట్రోజు రాజు, నియోజకవర్గంలోని మండ లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మండల, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.