Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
స్వయం సహాయక బృందాలు నిర్వహించుకునే నెలసరి సమావేశంలో జరిగే లావాదేవీలను ఎప్పటిక ప్పుడు ఆన్లైన్లో నమోదుచే సుకున్నట్లయితే సభ్యుల మధ్య పారదర్శకత ఏర్పడుతుందని సిబిఓ ఆడిటర్ సంపత్, ఇల్లంద క్లస్టర్ కో-ఆర్డినేటర్ గోలి కొమురయ్యలు సూచించారు. మంగళ వారం ఇల్లంద గ్రామంలోని స్వయం సహాయక బృందాల ప్రతినిధులకు బుక్ కీపర్లకు ఆన్లైన్ అకౌంటింగ్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని నెలసరి లావాదేవీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను వివరించారు.నెలసరి సమావేశంలోనే ఆన్లైన్ అకౌంటింగ్ చేయడం ద్వారా అవక తవకలకు చెక్‌పెట్టవచ్చని తెలిపారు.ఈ శిక్షణలో వివోఏలు తక్కలపల్లి శోభ రమ తక్కలపల్లి పద్మావతి వివో ప్రతినిధులు తూల శ్రావణి, భాను, అరుణ, తాడికాయ ల మౌనిక, కీపర్లు, మౌనిక, స్వప్న, మమత తదితరులు పాల్గొన్నారు.