Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం హనుమకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రభుత్వ స్థలాల్లో గు డిసెలు వేసుకొని జీవిస్తు న్న నిరుపేదలకు పట్టాలి వ్వాలని సీపీఎం హన్మకొం డ సౌత్ మండల కార్యద ర్శి మంద సంపత్ అన్నా రు. మంగళవారం సీప ీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంగా ప్రభుత్వ ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకొని ఆటో కార్మికులుగా, భ వన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పాచిపని చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల కు చెందిన పేదలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా వీరి బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అనేక హా మీలు ఇస్తున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పేద ప్రజల బాధ లు పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత సంవ త్సరం కాలంగా గుడిసెలు వేసుకొని ఉంటున్న వీరికి పట్టాలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. గెలిచిన నాయకులు పేదల ఇళ్లస్థలాల గురించి గానీ చట్టాల గురించి గానీ పట్టించుకోవడం లేదని వి మర్శించారు . కరోనా వచ్చి పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా పేద ప్రజ లను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అ న్నారు. దీనికి తోడుగా ప్రజలపై ధరల భారాలు, పన్నుల భారాలు మోపుతున్నా రని వీటిని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలకమిటీ సభ్యులు, ఆలకుంట యకయ్య, దూడపాక రా జేందర్, నోముల కిషోర్, ఆలకుంట మల్లయ్య, ఎన్నాం వెంకటేశ్వర్లు, కంచర్ల కుమ రస్వామి ప్రజా సంఘాల బాధ్యులు మోతె సతీష్, జడ రమేష్, రాంఖి, పొట్లపల్లి రాజు, మనోహర్, శ్వేతా,రాధ, కావ్యశ్రీ, దుర్గ, రామ, స్రవంతి, శోభ,చామంతి, రా ణి,రమ్య,రమ, సుధాకర్, అలీ, చందర్, అనిత, మురళీ, విజరులు పాల్గొన్నారు.