Authorization
Sun March 02, 2025 07:54:35 am
నవతెలంగాణ-రాయపర్తి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మనబడి కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశా లలకు మహర్దశ వచ్చిందని రాయపర్తి గ్రామసర్పంచ్ గారె నర్సయ్య అన్నారు. మం గళ వారం మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న డైనింగ్‌హాల్ నిర్మాణంపనులను ఏఈ మురళికృష్ణతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ ర్రబెల్లి దయాకర్‌రావు అధిక నిధులు కేటాయిస్తూ కార్పొరేట్ స్థాయిలో బడులను అభివద్ధి చేస్తున్నారని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేపట్టి పాఠశాలలను సకల సౌకర్యాలతో సిద్ధం అయ్యే విధంగా పనులు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలవుతున్న బడులలో అన్ని వసతులు, చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా నేషనల్ స్కూళ్లను మరి పించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయని వివరించారు. అవసర మైన చోట మరమ్మతు పనులను చేపడుతూ లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నీచర్, డిజిటల్ విద్యా బోధనకు సంబంధించిన పనులుచేపట్టడం సంతోషకారం అన్నారు. ఆయనతోపాటు గ్రామ పంచాయతీ కార్యదర్శిఅశోక్, కాంట్రాక్టర్ పురుషోత్తం, పాఠశాల ప్రధానోపాధ్యా రాలు ఉమాదేవి తదితరులు ఉన్నారు.