Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులను అభినందించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-వర్ధన్నపేట
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో బలోపేతం చేయడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు అరుదైన శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. వర్ధన్నపేట ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మంగళవా రం వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహస్వామి, గైనకాలజిస్ట్ డా క్టర్ సోమశేఖర్ల సంయుక్త ఆధ్వర్యంలో మహిళ గర్భసంచిలోని అతిపెద్ద కణితిని తొలగించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లోని నిరుపేద కుటుంబా నికి చెందిన మహిళ సట్ల హేమలత గతికొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడు తూ వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులలో సంప్రదించడంతో వైద్యులు నిర్ధార ణ పరీక్షలు నిర్వహించి మహిళా గర్భసంచిలో కనితి ఉన్నట్టు గుర్తించారు. గర్భ సంచిలోని కణితిని తొలగించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధముల సదు పాయాలు ఉండడంతో మంగళవారం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి నాలుగు కిలోల కనితిని తొలగించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ గర్భసంచిలోని ఆ కణితిని తొలగించినందుకు ఇల్లంద సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు వైద్యులు నరసింహస్వామి, సోమశేఖర్లను అభినందించారు.