Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డిఓ శ్రీనివాస్
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల లోని కాపురం ఓసీపీ బ్లాక్-1కు డేంజర్ జోన్లో 500 మీటర్ల దూ రంలో ఉన్న భూములు ,2,817 ఇండ్లను సేకరించ డానికి ఈ నెల 13న గెజిట్ పబ్లిక్ నోటిఫికేషన్ (ప్రిలిమరి నోటిఫికేషన్) జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నోటిఫికేషన్ పై నిర్వా సితులకు అపోహలు, అనుమానాలను మంగళవారం భూపాలపల్లి జిల్లా ఆర్డిఓ, భూసేకరణ అధికారి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వా సితులతో సర్పంచ్ సుంకరి సత్తయ్య అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ముందుగా నిర్వాసితుల భూముల, ఇండ్ల జాబితాను మూడు గంటలపాటు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లా డారు జాబితాలో ఇంటి పేర్లు,నెంబర్లు,చెట్లు,బావులు తదితరవి రానివారు అపోహలు విడి ఆర్డిఓ, తహ సీల్ధార్ కార్యాలయంలో ఆధారాలతో 60 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరో మూడు నెలల్లో డీఅండ్ డీడీి నోటిఫికేషన్ తప్పులు లేకుండా పీడీఏప్ జాబితా ప్రకటించడం జరుగుతుం దన్నారు. అనంతరం ఆర్డీఓను కమిటీ సన్మానించిం ది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్హర్రావు, తహ సీల్ధార్ జీవాకర్ రెడ్డి, ఆర్ఐ సరితా, ఎంపిటిసి-1 రావుల కల్పన మొగిలి, ఉపసర్పంచ్ చెంద్రయ్య, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్, నిర్వాసితులు పాల్గొన్నారు.