Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధూకర్
నవతెలంగాణ-మహాదేవపూర్
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధూకర్ అన్నారు. మండలంలోని బొమ్మాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ముల్కల చిన్న సడువళి ప్రమాదంలో మరణించింది. కాగా పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.2,00,000 విలువైన చెక్కును మంగళశారం వారి ఇంటికి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ , భూపాలపల్లి జడ్పీ చైర్‌ర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, సహకార బ్యాంకు చైర్మన్ సల్ల తిరుపతయ్య, సర్పంచ్ శ్రీపతి బాపు, మండల యూత్ అధ్యక్షుడు యండి,అలీమ్ ఖాన్, రవీందర్‌రెడ్డి, మహాదేవపూర్ ఉపసర్పంచ్ సల్మాన్‌ఖాన్, మహిళ అధ్యక్షులు స్వప్న, టిల్లు,రవి సాగర్ తదితరులు పాల్గొనడం జరిగింది.