Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
పీఏసీఎస్ నిర్మాణ పనులను నిలిపివేసి, సంబంధిత స్థలాన్ని పాఠశాలకు అప్పగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలో సంత కాల సేకరణ చేపట్టి వారు మాట్లాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరిధి మండల క్రీడా మైదానం పరిధి స్థలంలో పీఏసీఎస్ గోదాం కార్యాలయ నిర్మాణంతో విద్యార్థులకు అన్యాయం జరుగు తుంద న్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని క్రీడామైదానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయా లని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆం దోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, మాలభేరి రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్, క్రీడాకారులు కబడ్డీ శంకర్, వ్యకాస జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ అదివాసి గిరిజన సంఘం నాయకులు శరత్, అశోక్ , లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.