Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజిత్‌కు జీఎస్సార్ పరామర్శ
నవతెలంగాణ-గణపురం
కాంగ్రెస్ పార్టీ సీతారాంపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు పీట్ల రంజిత్‌పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం గాయపడిన రంజిత్‌ను పరామర్శించి ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అశేష ప్రజాదరణను చూసి ఓర్వలేక కొంత మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయ కులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొంతమంది బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నాయకులు అసభ్యకరమైన పదజా లంతో దూషించి, దాడి చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న అశేష ఆదర ణను చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడు తున్నారని విమర్శించారు. దాడి చేసిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.