Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకో వాలని కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ జి.జయ వసంత లక్ష్మి అన్నారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయం తిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయ వసంతలక్ష్మి మాట్లాడుతూ ... పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యా యురాలని, దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఘనత సావిత్రికే దక్కిం దని కొనియాడారు. నాటి సమాజం ఆడపిల్లలకు చదువును దూరం చేసే క్రమంలో సావిత్రి ముం దుండి వేలాది మహిళలకు చదువు చెప్పి చైతన్య వంతం చేసిందని తెలిపారు. తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో అనేక పాఠశాలలు ప్రారంభించి మహిళలకు అక్షరాలను నేర్పించిందన్నారు. అనేక సేవా కార్యక్రమంలో ముందుండి సేవ చేస్తూ వీరమరణం పొందిన త్యాగమూర్తి అని కొనియా డారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రం లోని సతారా జిల్లాలోని నైగాన్ గ్రామంలో జన వరి 3, 1831 సంవత్సరంలో సావిత్రిబాయి పూలే జన్మించింది అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన కషికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని, తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరిపించాలని కోరారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు నేరెళ్ల జోసెఫ్, జడల రాజేశ్వరి, పోతుల పవన్, సూరం రాజు, బోల్లపల్లి తిరుపతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గొర్లవేడు పాఠశాలలో...
సావిత్రిబాయి పూలే 192 జయంతిని భూపా లపల్లి మండలంలోని గొర్లవేడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు పసుల శ్రావణ్‌కుమార్ మాట్లాడారు. అగ్రవర్ణ ఆధిపత్యానికి, స్త్రీల అణచి వేత, పురుషాధిపత్య సమాజానికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే అనేక ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు.స్కూల్ అసిస్టెంట్ కందుకూరి దేవదాసు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త సహకారంతో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించి పేద దళిత వర్గాల ప్రజలకు విద్యను అందించేందుకు కృషి చేసిందన్నారు. బాల్య వివాహాల నిరోధనకు, మూఢాచారాలకు వ్యతిరేకంగా వితంతు వివాహాలు జరిపించుటకు, సతీసహ గమనం నిర్మూలించడం కోసం పాటుపడిందన్నారు. ఉపాధ్యాయులు బి. వెంకటేశ్వర్లు, షబానా అంజుం, కే రమేష్ ,జి.విజయ, కె నవనీత్ కుమార్, ఏ. జయ ప్రకాష్ ,కే. శంకర్రావు , పి శంకర్రావు ,సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్మార్సీఎస్ పార్టీల ఆధ్వర్యం, గ్రామా ల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాల, ఎడ్లపల్లి మోడల్ పాఠశాల, మల్లారం కస్తూ ర్బా ఆశ్రమ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్, కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, బండి స్వామి, చెంద్రయ్య,అంజయ్య, బీఆర్ఎస్ నాయకుడు కందుగుల రఘుపతి, కాపురం రైతు సమితి అధ్యక్షుడు బండి సుధాకర్, ఎమ్మార్పీఎస్ నాయ కుడు నరేశ్ పాల్గొన్నారు.
పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి
నవతెలంగాణ-చిట్యాల
విద్య వ్యాప్తికి కృషిచేసిన సావిత్రిబాయి పూలేను యువత ఆదర్శంగా తీసుకోవాలని జడ్పిటిసి సాగర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్ అధ్యక్షతన సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. జడ్పిటిసి గొర్రె సాగర్ పాల్గొని మాట్లాడారు. ఇన్చార్జి సర్పంచ్ ఆ కుల రవీందర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్క తిక కార్యదర్శి జన్నే యుగేందర్, మండల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కిరణ్, నర్సింహ రాములు, రాజేందర్, రమేష్ పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కాటారం
సావిత్రిబాయి పూలే జయంతిని కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి రమేష్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువు ద్వారా మాత్రమే ఉన్నత స్థాయిలో ఉండగలరని ఆకాంక్షించి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. మండల అధ్యక్షుడు వేమునురి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సమ్మయ్య, టిపిసిసి మహిళా కార్యదర్శి ఆంగోతు సుగుణ, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రెడ్డి, ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, సర్పంచ్ అజ్మీర రఘురాం నాయక్, వెంకటస్వామి, రమేష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పూలే స్పూర్తితో అధ్యయనం చేయాలి
సావిత్రిబాయి పూలే జయంతిని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులు యువకులు సమాజాన్ని మహనీయుల చరిత్రలను అధ్యయనం చేయాలనికోరారు. ప్రభు త్వాలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ఉల్లంఘిస్తూ, చట్టాలను నీరుగారుస్తూ, మహిళల ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. సావిత్రి బాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించా లని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేందర్ , డీవైఎఫ్ఐ నాయకులు సందీప్ భగవాన్, ఎస్ఎఫ్ఐ నాయకులు కిషోర్, స్మరణ పాల్గొన్నారు
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ-మహాదేవపూర్
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి భాయి పులే జయంతిని మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కట్కం అశోక్, కోట లక్ష్మి సమ్మయ్య, కుదురుపల్లి సర్పంచ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజబాబు, సీనియర్ నాయకులు లింగాల సమ్మయ్య, శివరాజు, యూత్ నాయకులు కడర్ల నాగరాజు, రాఘవేంద్ర, నయుమోద్దీన్, ఆఫీజ్, శ్రీను, పరమేష్ సోహెల్ పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో . సావిత్రిబాయి పూల జయంతిని నిర్వహించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాద్, మహిళా అధ్యాపకురాలు సరిత, ఇందిర, శ్వేత, సంధ్య రమాదేవి, అధ్యాపకులు సమ్మయ్య, సదాశివ వీర్రాజు మోహన్, సదానందం, ఎన్ఎస్ఎస్ పీఓ డి రమేష్ పాల్గొన్నారు.
డీటీఎఫ్ ఆధ్వర్యంలో
మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బన్సోడ రాణిబాయిని డీటీఎఫ్ ఉపాధ్యాయులు సన్మానించారు. దాదాపు 40 మంది మహిళా ఉపా ధ్యాయ ఉద్యోగులను సన్మానించారు. ప్రత్యేక అతిథిగా కాళేశ్వరం వైద్యాధికారి సుస్మిత హాజరై మాట్లాడారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి ఐత తిరుపతి రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు మడ్క మధు, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సారంగపాణి, జిల్లా ఉపాధ్యక్షు రాలు అల్లెం దేవేంద్ర, జోనల్ బాధ్యులు తిరుపతి, రాష్ట్ర కౌన్సెలర్ అజ్మీరా లక్షణ్నాయక్, ప్రధానోపా ధ్యాయులు శంకరయ్య, ఆకుల అశోక్, కాంప్లెక్స్ మాణిమల, ఎస్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
రైసింగ్స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో...
సావిత్రిబాయి పూలే జయంతిని స్థానిక రైసింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మంజులా రెడ్డి మాట్లాడుతూ సావిత్రి బాయి పూల మహిళా ఉపాధ్యాయినులందరికీ ఆద ర్శంగా నిలిచారన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కరస్పాండెంటెను సన్మానించారు.
సామాజిక హాస్పటల్ ఆవరణలో...
మహాదేవపూర్ మండల కేంద్రం లోని సామా జిక హాస్పటల్ ఆవరణలో ఎంమ్ఎస్పీ మండల ఇంచార్జీ తూటిచెర్ల దుర్గయ్య అధ్వర్యంలో సావిత్రి భాయిపూలే జయంతిని నిర్వహించారు. ముఖ్య అధితులుగా మహాదేవపూర్ ఇంటర్ కాలేజీ మహిళ లెక్చరర్ శ్వేత హజరై మాట్లాడారు. మహాదేవపూర్ సూపరింటెండెంట్ గంట చంద్రశేఖర్, ఐసిటిసిసి గాదే రమేష్, టెక్నికల్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రసాద్ హాస్పిటల్ హెడ్ నర్స్ బాలమతి, దళిత నాయకులు సమ్మయ్య, నిఖిల్ పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలలో 'పూలే' జయంతి
నవతెలంగాణ-మంగపేట
బ్రాహ్మణపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతిని ప్రధానోపాద్యాయుడు కల్తి శ్రీనివాస్, ఉపాద్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పూలే ఉపాద్యాయురాలుగా సంఘ సంస్కర్తగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మహిళా ఉపా ధ్యాయురాలు వరలక్ష్మీని సన్మానించారు. ఉపాధ్యా యులు సాంబయ్య, రాజశేఖర్, జవహర్ లాల్, బుచ్చయ్య, నాగేశ్వరరావు, క్రాంతి పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో...
నవతెలంగాణ-గోవిందరావుపేట
భారతదేశంలో మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయు రాలు సావిత్రిబాయి పూలే అని డీఎస్పి మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతిని డిఎస్పి మండల ఉపాధ్యక్షులు డొంకా చిన్న అధ్యక్షతన నిర్వహించారు. అజరు కుమార్ హాజరై మాట్లాడారు. యువత,విద్య వంతులు,మేధావులు ఉద్యోగస్తులు మహనీయుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ప్రధానోపాధ్యాయు లు రఘు రామ్, అశోక్, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సంగి సందీప్, నాయకులు శ్రీహరి, శ్యామ్, అన్వేష్, నవీన్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.