Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు మండల వ్యవసాయ అధికారి. ప్రభావతి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎరువుల దుకాణాల్లోని రికార్డులు స్టాకు వివరాలను తనిఖీ చేశారు. స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని, రైతులు ఎరువు బస్తాలు కొన్నపుడు వారికి తప్పకుండా రశీదు ఇవ్వాలని సూచించారు.