Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా మండలంలోని అప్పాజిపేట గ్రామంలో ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ... అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని, అపరిచితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వ్యక్తిగత సమాచారం అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. పిల్లలను ఉన్నతంగా చదివించాలని వారికి మంచి భవిష్యత్తును కలిగించాలని కోరారు. అనంతరం పిల్లలకు బిస్కిట్లు స్వీట్లను పంచిపెట్టారు. ఎస్సై వెంట సీఆర్పిఎఫ్ సిబ్బంది ఉన్నారు.