Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్నరెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని మల్లారం, ఆన్సాన్పల్లి, నాచారం, తాడిచెర్ల, తాడ్వాయి గ్రామాల్లో ఇప్పటికే పలు చెరువులు కబ్జాలకు గురయ్యాయి. కాగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల కోసం చెరువు మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్,రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మల్లారం గ్రామపంచాయతీ పరిధి డబ్బగట్టు రెవెన్యూ శివారు చిన్న చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆయకట్టు రైతులు పేర్కొం టున్నారు. పెద్దపల్లి జిల్లా చిన్న ఓదెల మానేరుపై మల్లారం మానేరు ఒడ్డు వరకు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.50కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం రెండు సంవత్సరాలుగా నత్తనడకన సాగుతోంది. కాగా అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారు చెక్ డ్యామ్ పనులు తూతుమంత్రంగా చేయడంతో ఇప్ప టికే రెండు సార్లు మానేరు ప్రవాహానికి ధ్వంసం అ యింది. చెక్ పక్కనున్న రైతుల పొలాలు సైతం కోతకు గురయ్యాయి. కోతకు గురైన పొలాలు, చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రహదారి వేయడానికి చెరువు నుంచి అక్రమ దారి ఏర్పాటు చేసుకొని చెరు వు మట్టిని యథేచ్చగా తరలిస్తున్నారని స్థాని కులు వాపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో మత్స్యకారులు, పశువులు చెరువు గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటలు కోకొల్లలు ఉన్నాయి. కాగా చెక్ డ్యామ్ గుత్తేదారు చెరువులో అక్రమంగా దారి వేసి ఫారెస్ట్వారి అనుమతులు లేకుండానే మట్టి దందా సాగించడం గమనార్హం.
టిప్పర్లు వెళ్తే చర్యలు తప్పవు
బి శ్రీనివాస్ రెడ్డి, తాడిచెర్ల సెక్షన్ అధికారి
పారెస్ట్ లో నుంచి లారీలు, తప్పర్లు,ట్రాక్టర్లు వెళ్ళితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో ఇలా అక్రమంగా వెళ్ళితే ఇదే గుత్తేదారు వాహనాలపై రూ.2.40 లక్షల జరిమానా విధించి శాఖ పరమైన చర్యలు చేపట్టాము.
మట్టి తవ్వకాలకు అనుమతులు లేవు...
ఇరిగేషన్ జేఈ
మల్లారం చిన్న చెరువు నుంచి మట్టి తవ్వకాల కోసం ఎలాంటి అనుమతులు లేవు. రెవెన్యూ, ఇరిగే షన్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.