Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కాటారం
2017 నుండి నేటి వరకు సుమారుగా 6 సంవత్సరాల నుండి నిత్యవసరాల వస్తువు ధరలు పెరిగిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెస్ కాస్మోటిక్, స్కాలర్షిప్ పెంచడం లేదని, వెంటనే పెంచాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బొడ్డు స్మరన్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టి ఆయన మాట్లాడారు. ఒక్కో విద్యార్థికి రూ.35తో మూడు పూటల భోజనం ఎలా పెడతారని అన్నారు. బస్ పాస్ ఛార్జీలు పెంచుతున్న ప్రభుత్వానికి మెస్ చార్జీలు పెంచడంలో నిర్లక్ష్యమెందుకని అన్నారు. పెరిగిన ధరలకు అను గుణంగా మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచకుంటే సమరశీల పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. నాయకులు మండల అధ్యక్షులు బొడ్డు కిషోర్, రాజు , కార్తిక్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ స్కాలర్షిప, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మంగళవారం హాస్టల్ విద్యార్థులతో కలిసి మండల కేంద్రం లోని అమరవీరుల స్థూపం వద్ద రాస్తా రోకో చేపట్టారు. ఎస్ఎఫ్ఐ మండల కార్య దర్శి కుమ్మరి రాజ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు మండల మోహన్, రాజు, కార్తిక్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.