Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎఎ్మల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, టిజీవో అధ్యక్షురాలు మమత, ఎంపిడిఓల సంఘం ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు హైద్రాబాద్‌లోని మంత్రి నివాసంలో వీరు కలిశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య దర్శి సందీప్ సుల్తానియా, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్రెడ్డిలు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పోరిక గోవింద్ నాయక్ మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేల పరిధిలోని తన శాఖ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులుంటే నా దృష్టికి తీసు కురావాలని, వెంటనే పరిష్కరిస్తానన్నారు. టిజీవోల క్యాలెండర్, డైరీ-2023ని, ఎంపిడిఓల డైరీని మంత్రి ఆవిష్కరించారు. ములుగులో మరిన్ని గ్రామపంచాయతీ భవనాలు మంజూరు చేయాలని కోరడంతో సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.