Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశోధనాత్మక కథనాలు రాయాలి
- జిల్లా ఎస్పీ జె సురేందర్ రెడ్డి
- నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్-2023 ఆవిష్కరణ
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పత్రికలు పని చేయాలని, పరిశోధనాత్మక కథనాలు రాయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పి ఏ. రాములు వేరువేరుగా ప్రముఖ దినపత్రిక నవతెలంగాణ 2023 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల సమస్యలు అధికారుల దష్టికి తీసుక వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నవతెలంగాణ ముందు వరుసలో ఉంటుందని కొనియాడారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని,నవతెలంగాణ పత్రిక ప్రజల మన్ననలు పొందుతూ, మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విలేకరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్సై స్వప్న కుమారి, నవ తెలంగాణ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్, అనన్ టూర్స్ నిర్వహకులు పుల్ల సజన్, లతోపాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.